మార్కాపురం: తర్లుపాడు మండలంలో ప్రశాంతంగా జరిగిన ఎస్ఎంసి ఎన్నికలు
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని ఎంఈఓ శ్రీనివాసులు తెలిపారు. మొత్తం 51 పాఠశాలలకు ఎన్నికలు జరపగా 48 పాఠశాలలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక విజయవంతంగా నిర్వహించామన్నారు. మిగిలిన మూడు మంగళ కుంట తుమ్మలచెరువు గానుగపెంట పాఠశాలల్లో కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి అన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామన్నారు.