గట్టు: గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారుల ఆకస్మిక తనిఖీలు
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ అజ్గర్ అలీ తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరు మరియు రికార్డులను పరిశీలించి, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.