వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ కోటిరెడ్డి
జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా మార్చి 31వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ధర్నా, రాస్తారోకో, నిరసన, ర్యాలీలు చేయకూడదన్నారు. పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతిభద్రతలు, ప్రజాధనానికి నష్టం కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.