వికారాబాద్: దారూర్ శివారులో మూలమలుపు వద్ద అతివేగంతో వచ్చి కారు బోల్తా, ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
వికారాబాద్ జిల్లా దారూర్ మండల శివారులోని మూలమలుపు వద్ద అతివేగంతో వచ్చి కారు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి తాండూర్ వైపు వెళ్తున్న కారు అతివేగంతో వెళ్లి ఒంటి మామిడి మూలమలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.