బనగానపల్లె: మండలంలో పలు గ్రామాలలో నిలిచిపోయిన అదనపు పాఠశాల గదులు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని పలు గ్రామాల పాఠశాలల్లో గత ప్రభుత్వం చేపట్టిన అదనపు గదుల నిర్మాణాలు ఎప్పటికీ పూర్తవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బనగానపల్లె, పలుకూరు తదితర సుమారు 10 పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతుల పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.