సిద్దిపేట రూరల్: దసరా, బతుకమ్మ సెలవుల్లో అప్రమత్తంగా ఉండండి: సిద్దిపేట పోలీసుల సూచనలు
దసరా సెలవులు, బతుకమ్మ వేడుకల సందర్భంగా సిద్దిపేట రూరల్ ఎస్సై నవత ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇళ్ల భద్రత, పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు విద్యార్థులు పాటించాల్సిన నియమాలను వివరించారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి, అత్యవసరమైతే 112కు కాల్ చేయాలని కోరారు.