నందికోట్కూరు: కొత్తపల్లి మండలంలో జొన్న పంటకు ముడత పురుగు బెడద తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నీటి కొరత ఏర్పడడంతో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు కొత్తపల్లి మండలంలోని రైతులు ఆరుతడి పంటగా జొన్న సాగు చేశారు ప్రస్తుతం ఈ పంటకు ముడుత పురుగు బెడద పట్టుకుంది పురుగులు ఆకులలో తినేస్తుండడంతో పంట ఎదుగుదల మందగించిందని రైతులు వాపోతున్నారు నీటి కొరత తో పాటు ఇప్పుడు ఈ తెగులు కూడా తోడవడంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు