కోరుట్ల: కోరుట్లలో వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడ సేవ
కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకుని గరుడ సేవ ఘనంగా జరిగింది. స్వామి వారు గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగారు. భక్తులు మంగళ హారతులతో స్వామిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.