గద్వాల్: జిల్లాలో ఓటరు జాబితాను సరిచేసే ప్రక్రియను సమర్ధవంతంగా పూర్తి చేయాలి:జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ
శనివారం మధ్యాహ్నం ఐడీఓసీ సమావేశం హాల్ నందు ఓటరు జాబితా సరి పోల్చే ప్రక్రియ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 2002, 2025 ఓటరు జాబితాల సరిపోల్చే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఓటరు జాబితా సరిపోల్చటంలో రెవిన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని పరిశీలించాలని తెలిపారు.ఓటర్ల జాబితా పరిశీలనను సక్రమంగా నిర్వహించేందుకు నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు.