తెల్కపల్లి: నాగర్కర్నూల్: ఓటరు జాబితా సవరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ జాబితాలో చేర్చాలని, నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.