జనగాం: జనగామ కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా: చెరువును నింపాలని డిమాండ్
జనగామ కలెక్టరేట్ ఎదుట వడ్లకొండ రైతులు ఆందోళన చేపట్టారు. గోదావరి నీటితో వడ్లకొండ చెరువును నింపాలని, తద్వారా 5 గ్రామాల పంటలను కాపాడాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.