గుంతకల్లు: సేవాలాల్ జన్మస్థలం సేవాగడ్, గుత్తి మండలం సేవాగడ్ లో సంత్ సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు వెల్లడి
చరిత్రకారులు, భౌతిక ఆధారాలు, పూర్వీకులు చెప్పిన చరిత్రను బట్టి బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని సేవాగడ్(రామగుండం తండా) లో జన్మించారని సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కొర్ర జగన్నాథరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్ర నాయక్ లు తెలిపారు. గుత్తి మండలంలోని సేవాగడ్ లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జన్మస్థలం గురించి ఎలాంటి వివాదాలకు తావు లేదన్నారు. జానపద గీతాలు, బంజారా సాంప్రదాయ మౌలిక కథల్లో గుత్తి-బళ్లారి, కాళోకుండో, చెండ్రాయిని కుంట ఉందని అన్నారు.