శ్రీశైలం: తొలిసారి పంచాయతీ ఎన్నికలు వచ్చినా సున్నిపెంటను ఏకగ్రీవం చేసుకుందాం ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
శ్రీశైలం మండలం సుండిపెంటలో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో సుండిపెంట రెడ్ల కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు,నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు సుండిపెంట మొదటిసారి పంచాయతీ ఎలక్షన్ రాబోతుందని గ్రామ ప్రజలందరూ కలిసి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఊరి బాగుపడుతుందని గ్రామం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు సుండిపెంట గ్రామ పంచాయితీ రావడం తన కల అని తనకు ఎంతో సంతోషంగా ఉందని MLA అన్నారు