విశాఖపట్నం: సింహాచలం దేవస్థానానికి ప్రతిష్టాత్మక 'స్వచ్ఛాంధ్ర' అవార్డులు
స్వచ్ఛత మరియు మెరుగైన నిర్వహణలో సింహాచల దేవస్థానం రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులను గెలుచుకుంది. ఈవో జల్లేపల్లి వెంకటరావు ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డును అందుకోగా, ఏఈవో పిల్లా శ్రీనివాసరావు, డీఈ రామరాజు జిల్లా స్థాయి అవార్డును స్వీకరించారు.