జనగాం: జనగామ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు
జనగామ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కౌన్సిలర్లు మరియు అధికారులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాహిత్యం మరియు ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.