ఉరవకొండ: తగ్గుపర్తిలో ఘనంగా శ్రీ సుంకలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొన్న ప్రముఖులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామంలో శ్రీ సుంకలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు బెల్డోన స్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ఠ పూజలు హోమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ సోదరులు పయ్యావుల శ్రీనివాసులు, అనంతపురం శాసనసభ్యులు వెంకటప్రసాద్ లు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మాజీ సహకార సంఘ అధ్యక్షులు వెంకటనాయుడు, నాయకుల రాధాకృష్ణ, జయప్ప తదితరులు పాల్గొన్నారు.