కుప్పం: రామకుప్పం వద్ద హైవేపై భారీ ప్రమాదం: ఆగి ఉన్న లారీలను ఢీకొన్న మరో వాహనం
కుప్పం-పలమనేరు హైవేపై చెల్దిగానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ పనుల కోసం ఆపి ఉంచిన మూడు లారీలను మరో లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన డ్రైవర్ రాజేంద్రను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.