వర్ధన్నపేట: వర్ధన్నపేటలో పేరుకుపోయిన చెత్త: ఇబ్బందుల్లో స్థానికులు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చెత్తను సకాలంలో తరలించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారిపై చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.