గుంతకల్లు: పామిడి నూతన ఎస్ఐగా రాఘవేంద్రప్ప, సీఐ సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ
అనంతపురం జిల్లా పామిడి నూతన ఎస్ఐగా రాఘవేంద్రప్ప శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఉన్న ఎస్ఐను బదిలీ చేయగా అప్పటి నుంచి ఎస్ఐ సీటు ఖాళీగా ఉంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు అనంతపురం వీఆర్ లో ఉన్న రాఘవేంద్రప్పను పామిడి ఎస్ఐగా పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. పామిడి పోలీసు స్టేషన్ లో సీఐ శివశంకర్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేంద్రప్ప మాట్లాడుతూ శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామని అన్నారు. మండలంలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.