జడ్చర్ల: మిడ్జిల్ మండలంలో ఎడతెరిపి లేని వర్షాలు.. అన్నదాతకు కష్టాలు
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూర్లోని రైతులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలన్నీ పాడైపోతున్నాయని వాపోయారు. పత్తి, మొక్కజొన్న, వరి, తదితర పంటలు సాగు చేయడానికి ఒక్కొక్క ఎకరానికి రూ.30,000 దాకా పెట్టుబడికి ఖర్చు చేశామన్నారు. ఈ అధిక వర్షాలతో పెట్టిన పెట్టుబడి రాక, అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం పాడైపోయిన పంటలపై అంచనా వేసి తగు పరిహారం చెల్లించాలని కోరారు.