జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలో 3వ వార్డులో పర్యటించిన మున్సిపల్ ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత
జడ్చర్ల పురపాలక ఛైర్పర్సన్ కోనేటి పుష్పలత నర్సింహులు గురువారం పట్టణంలోని 3వ వార్డులో పర్యటించారు. ఆమె వార్డు ప్రజలను నేరుగా కలిసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తామని వెల్లడించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.