మంథని: కాసిపేట ప్రజావాణిలో మిషన్ భగీరథ నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు
కాసిపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ముత్యంపల్లి గ్రామానికి చెందిన పుట్ట కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. గ్రామంలోని 7 కొత్త ఇందిరమ్మ ఇళ్లకు మిషన్ భగీరథ తాగునీటి నల్లా కనెక్షన్లు కల్పించాలని ఆయన విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ సింగ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.