నందికోట్కూరు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో ప్రమాద వదంతులు నమ్మవద్దు ఇరిగేషన్ ఎస్ ఈ శివశంకర్ రెడ్డి
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను ఇరిగేషన్ ఎస్ ఈ శివ శంకర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు, ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రోప్ మరమ్మతు లు చేస్తుండగా తొమ్మిదవ నెంబర్ గేటు ఐరన్ రోప్ తెగిపోయి నీరు వృధాగా పోతుందని వస్తున్న వదంతులను నమ్మ వద్దన్నారు, విధి నిర్వహణలో భాగంగా జరిగిందన్నారు, వీటికి సంబంధించి మరమ్మతులు చేస్తున్నామన్నారు, నివేదికలను ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుందని వారు తెలిపారు