మణుగూరు: 12 మంది విద్యార్థులను వాటర్ పైపుతో చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రామానుజవరం హైస్కూల్లో దారుణం. అల్లరి చేశారనే నెపంతో 12 మంది విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు యశోద వాటర్ పైపుతో కొట్టారు. విద్యార్థుల ఒంటిపై వాతలు పడటంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి, ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.