పామర్రు: కృత్తివెన్నులో అక్రమంగా తరలిస్తున్న 19 గోవుల స్వాధీనం, వాహనం సీజ్
కృత్తివెన్ను వద్ద 216వ జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా తరలిస్తున్న 19 గోవులను స్థానికుల సాయంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గోవులను తుని నుండి నెల్లూరుకు తరలిస్తున్నారు. కేసు నమోదు చేసి, గోవులను తరకటూరు గోసంరక్షణశాలకు తరలించామని ఎస్సై పైడి బాబు తెలిపారు.