ప్రత్తిపాడు: కత్తిపూడి సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు: వైసీపీ నేత ప్రకటన
కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే రూ.2 కోట్లు ఇస్తామని ఆ పార్టీ ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు గౌతు స్వామి ప్రకటించారు. ఇతర పార్టీలు అంతకంటే ఎక్కువ నిధులు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని ఆయన తెలిపారు.