గద్వాల్: పాఠశాల స్వీపర్లకు ఏడాది పొడవునా వేతనాలు ఇవ్వాలి - సిఐటియు డిమాండ్
కే టి దొడ్డి మండలంలో స్వీపర్ల సమస్యలపై సిఐటియు సమావేశం నిర్వహించింది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా సంవత్సరం మొత్తం వేతనాలు ఇవ్వాలని, వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ ప్రభుత్వాన్ని కోరారు.