రాయదుర్గం: పట్టణంలోని చెత్త కంపోస్టు యార్డ్ 74 ఉడేగోళం సమీపానికి తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు
రాయదుర్గం పట్టణంలోని చెత్త కంపోస్టు యార్డ్ ను శాంతినగర్ నుంచి 74 ఉడేగోళం మద్దానేశ్వర స్వామి గుడి సమీపంలోకి మార్చనున్నారు. ఇటీవల కంపోస్టు యార్డ్ లో చెత్త తగలబడి నిరంతరం విషవాయువుల దాటికి చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణానికి దూరంగా తరలించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిపాదిత స్థలానికి ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అక్కడ శ్యానిటరీ ఇనిస్పెక్టర్ రవీంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కంపచెట్ల తొలగింపు చేపట్టారు. కొత్తగా వచ్చే చెత్తను త్వరలో అక్కడికి తరలించనున్నారు.