రహదారి పునర్నిర్మాణానికి తక్షణమే చర్యలు
- నాయుడుపేటలో రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో విశ్వబారతి స్కూల్ దగ్గర నుండి పాత ట్రెజరీ మరియు పార్కు వెనక ఉన్న R & B రోడ్ ను శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డా. నెలవల విజయశ్రీ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రహదారి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించానన్నారు. రహదారి పునర్నిర్మాణానికి సంబంధించిన చర్యలను తక్షణమే ప్రారంభించేలా సంబంధిత శాఖాధికారులతో చర్చిస్తామని తెలిపారు. ప్రజల రాకపోకలకు సౌకర్యం కలిగించే విధంగా రహదారి అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.