కురుపాం: అంతరాష్ట్ర రహదారి గోతులు పూడ్చకుంటే 21న ఆందోళన: సిపిఎం హెచ్చరిక
పార్వతీపురం-కూనేరు అంతరాష్ట్ర రహదారిపై భారీ గోతులు ఏర్పడ్డాయి. 20వ తేదీలోపు వీటిని పూడ్చకపోతే 21న ఆందోళన చేస్తామని సిపిఎం నేత కొల్లి సాంబమూర్తి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరుస తుపాన్లతో రహదారి ప్రమాదకరంగా మారిందని ఆయన తెలిపారు.