యాదగిరిగుట్ట: యాదాద్రిలో ఘనంగా గిరిప్రదక్షిణ: పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
స్వాతి జన్మ నక్షత్రం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు. వేలాది మంది భక్తుల నడుమ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు.