జనగాం: నల్గొండ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య: జనగామలో ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ
నల్గొండలో స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ జనగామలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. పప్పు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.