మందమర్రి: మంచిర్యాల: బంగారు వర్ణంలో మెరిసిపోతున్న వరి పొలాలు, కోతకు సిద్ధం
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో వరి పంట కోతకు సిద్ధమైంది. పొలాలు బంగారు వర్ణంలో మెరిసిపోతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికందే సమయం రావడంతో గ్రామ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది.