అనకాపల్లి: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో అత్యాధునిక క్రిటికల్ కేర్ విభాగం ప్రారంభం
అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో రూ.22.09 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంపుతో పాటు, త్వరలో డయాలసిస్ మరియు ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు.