మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్నగర్ పట్టణం లో నడిరోడ్డుపై ఆగిపోయిన డీసీఎం.. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు
మహబూబ్ నగర్ పట్టణం లోని బోయపల్లి రైల్వే గేట్ ప్రాంతంలో పాత ఇనుప సామాన్ల లోడుతో వెళ్తున్న లారీ గేర్ బాక్స్ పగిలిపోయి నడిరోడ్డుపై నిలిచిపోయింది. ఈ కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదురుగా రైల్వే గేట్ కూడా ఉండడంతో గేటు పడినప్పుడల్లా వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు.