మహబూబ్ నగర్ అర్బన్: గవర్నర్ను కలిసిన పాలమూరు యూనివర్సిటీ వీసీ నాలుగో స్నాతకోత్సవ వేడుకలకు హాజరుకావాలని
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య ఎన్ జి శ్రీనివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాలమూరు యూనివర్సిటీలో జరగనున్న నాలుగో స్నాతకోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించినట్లు ఉపసంచాలకులు వెల్లడించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.