డోన్: బేతంచెర్ల సమీపంలో రైలు నుంచి జారిపడిన తెలంగాణ యువకుడిని కాపాడిన రైల్వే పోలీసులు
Dhone, Nandyal | Nov 14, 2026 తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సిద్ధార్థ చారి స్నేహితులతో కలిసి నంద్యాల జిల్లా కొరటమద్ది గ్రామంలో వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా, బేతంచెర్ల మండలం కొత్తపల్లె సమీపంలో రైలు నుంచి జారిపడ్డాడు. స్నేహితుల సమాచారంతో స్పందించిన రైల్వే పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా యువకుడిని గుర్తించి డోన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు