అదిలాబాద్ అర్బన్: చాందా గ్రామంలో రైతులపై బ్యాంకుల వేధింపులు: నిరసన తెలిపిన బీఆర్ఎస్
ఆదిలాబాద్ జిల్లా చాందా గ్రామంలో పంట నష్టంతో ఇబ్బంది పడుతున్న రైతులను బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రుణాల వసూళ్ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.