కొండపి: కొండపి మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనదారుడు మృతి, జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి నుంచి అయ్య పరాజుపాలెం వెళుతూ కొండపి-పెద్దకండ్లకుంట మధ్య బైక్ పై వెళుతూ జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామ సమీపాన రైతులు మోటార్ ద్వారా నీళ్లు పెట్టుకునేందుకు పైపులు వేశారు. వాటిపై మట్టి పోసి స్పీడ్ బ్రేకర్లు తయారు చేశారు. దీంతో ఆయన కింద పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడు మర్రిపూడి మండలం అయ్యపరాజుపాలెంకు చెందినవాడిగా గుర్తించారు.