జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని అల్ఫా హోటల్లో పరిశుభ్రత పాటించనందుకు సానిటరీ ఇన్స్పెక్టర్ నరేశ్ రూ.5,000 జరిమానా
జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నేతాజీ చౌరస్తాలో ఉన్న అల్ఫా హోటల్లో పరిశుభ్రత పాటించనందుకు నిర్వాహకుడు గోరేటి సూరికి మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ నరేశ్ రూ.5,000 జరిమానా విధించారు. ఆయన మాట్లాడుతూ.. సూరి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, పరిశుభ్రత లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయించడంతో తనిఖీ నిర్వహించామన్నారు. జరిమాన విధించి, మొదటి హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు.