వనపర్తి: సూరవరం ప్రతాప్ రెడ్డి పార్కును ప్రెస్ క్లబ్‌గా మార్చవద్దు - బీఆర్ఎస్ డిమాండ్
వనపర్తిలోని సూరవరం ప్రతాప్ రెడ్డి పార్కును ప్రెస్ క్లబ్‌గా మార్చవద్దని బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ ఖీమ్యా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. పార్కును ప్రజలకే కేటాయించాలని, జర్నలిస్టుల కోసం ప్రత్యామ్నాయ స్థలంలో ప్రెస్ క్లబ్ నిర్మించాలని వారు కోరారు.