మందమర్రి: మంచిర్యాల: ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు
మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ బకాయిల చెల్లింపు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు.