మహబూబ్ నగర్ రూరల్: జడ్చర్ల: పాఠశాల ఆకస్మిక తనిఖీ, ఏడుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
జడ్చర్ల మండలం నర్సుల్లాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలను అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంతో, ఏడుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. విధుల్లో సమయపాలన పాటించాలని సూచించారు.