మంచిర్యాల: మంచిర్యాల అయ్యప్ప ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంచిర్యాల బైపాస్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.