వికారాబాద్: యాలల మండలంలో ఇసుక గుంతలో పడి వ్యక్తి మృతి: విశ్వనాథ్పూర్లో విషాదం
యాలల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామ సమీపంలోని కాగున వాగులో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతలో పడి మోత్కూరు కిష్టప్ప అనే వ్యక్తి మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అక్రమ ఇసుక తరలింపు వల్ల జరిగిన ఈ ప్రమాదంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.