బాపట్ల: బాపట్ల జిల్లాలో కొమ్మూరు కాలువను పరిశీలించిన కేంద్ర అధికారుల బృందం
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం కారంచేడు వద్ద ఉన్న కొమ్మూరు కాలువను కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో తుపాను వల్ల జరిగిన నష్టం, కాలువ పరిస్థితిపై అధికారులు వివరాలు సేకరించారు.