జనగాం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని పోస్ట్ కార్డులో ఉత్తరాలు వేసిన బిఆర్ఎస్ నాయకులు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వింత నిరసన తగిలింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ BRS నాయకులు పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు.ఎన్నికల ప్రచారం లో భారత రాష్ట్ర సమితి తరపున ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరడంతోనే తాము ఓటు వేసి గెలిపించామని,రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరారు కాబట్టి రాజీనామా చేయాలని ఉత్తరాలు రాసి పోస్టు డబ్బా లో వేశారు.