పలమనేరు: పలమనేరు ఆసుపత్రిలో అత్యాధునిక ప్రజారోగ్య ప్రయోగశాల ప్రారంభం
పలమనేరు ఏరియా ఆసుపత్రిలో రూ.1.25 కోట్లతో ఏర్పాటు చేసిన సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలను చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని వారు తెలిపారు.