విశాఖపట్నం: విశాఖ: నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థి భర్తపై దాడి, ఇద్దరి అరెస్ట్
విశాఖపట్నం ఆరిలోవలో 14వ వార్డు వైసీపీ అభ్యర్థి భర్త లావేటి దాసుపై దాడి జరిగింది. అభ్యర్థి కిరణ్మయి నామినేషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఎరాజి, జగదీశ్ అనే వ్యక్తులు కర్రలతో దాడి చేసి కారును ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.