పుంగనూరు: మేలు పట్లలో వ్యక్తిపై కత్తితో దాడి వ్యక్తికు త్రీవ గాయాలు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో మేలు పట్ల వద్ద మామిడి తోటలో ముగ్గురు యువకులు మద్యం సేవిస్తూ ఉండగా మామిడి తోటకు కాపలాగా ఉన్న వెంకటేష్ కుమారుడు, నారాయణ 58 సంవత్సరాలు ఇక్కడ మద్యం సేవించరాదని అన్నందుకు. మద్యం సేవించిన యువకులు నారాయణ పై కత్తితో దాడి చేయడంతో నారాయణ త్రివంగా గాయపడ్డాడు. దాడిలో గాయపడిన నారాయణను కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది. కత్తి దాడిలో గాయపడ్డ నారాయణ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో మాట్లాడుతూ ప్రాణహందని రక్షణ కల్పించాలని కోరారు.